![]() |
![]() |
.webp)
సోషల్ మీడియా స్టార్ అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ సమంతగా.. ఆమెకు మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తో బిగ్ బాస్ కి వెళ్ళింది.. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాక స్మాల్ స్క్రీన్ పై వరుసగా ఆఫర్లు సంపాదించడం మొదలు పెట్టింది. అంతేకాదు స్పెషల్ షోస్ తో ఎంటర్టైన్ చేసింది. ఇటు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ మంచి ఆఫర్ ని కొట్టేసింది. ఏ మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న మూవీలో ఆద్య అనే పాత్రలో అష్షురెడ్డి నటిస్తోంది. సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోయడం కూడా మొదలు పెట్టింది అష్షు రెడ్డి. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుని.. సిల్వర్ స్క్రీన్ వరకూ ఎలా రీచ్ అవ్వాలో అష్షుని చూసి నేర్చుకోవాలి.
ఇక కొన్ని రోజుల క్రితం స్టార్ట్ ఐన బీబీ జోడిలో అష్షు మెహబూబ్ కి జోడీగా డాన్స్ చేసింది. ఐతే సడెన్ గా ఏమయ్యిందో ఏమో కానీ అష్షు ఈ షో నుంచి పక్కకు తప్పుకుంది. ఇక మెహబూబ్ కి కూడా ఒక వాయిస్ నోట్ పెట్టి డాక్టర్ మెడికల్ ఎమర్జెన్సీ అన్నారు..కంప్లీట్ రెస్ట్ అవసరమన్నారు..నేను రాలేను అని కూడా చెప్పింది. ఇక ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే తన స్టేటస్ లో "10 క్విక్ క్వశ్చన్స్" అనే టాస్క్ ఇచ్చింది. అందులో ఒకరు "బీబీ జోడి ఎందుకు మానేశారు" అని అడిగారు. " నాకు హెల్త్ ఇష్యూ ఉంది. రికవర్ అవడానికి వన్ మంత్ పడుతుంది. నిజాలు తెలుసుకోకుండా ఎవరైనా ఫన్ చేస్తే మాత్రం నాకు నచ్చదు. ప్రతీ విషయం అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వేరే రకంగా ఆలోచిస్తూ పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి కష్టాలు వాళ్లకు ఉంటాయి. జరిగింది తెలుసుకోకుండా వేరే వారి గురించి అస్సలు ఫన్ క్రియేట్ చేయొద్దు" అంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది.
![]() |
![]() |